సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. కేసీఆర్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన బండి సంజయ్…తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశమే లేదన్నారు. తెలంగాణలో గెలవని పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎలా గెలుస్తుందంటూ ప్రశ్నించారు.
ప్రజాగోస…బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టి భారతీయ జనతాపార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తోంది. పరిగి మండలం రూప్ ఖాన్ పేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురింపిచారు బండి సంజయ్.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పొడుతుందంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సే లేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రాష్ట్రానికి 2.4లక్షల ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కనిపించడంలేదంటూ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెడుతూ అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్ ను గద్దె దింపడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలను వంచిస్తున్న కేసీఆర్..వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.