ఎన్నికల ఆయుధంగా CAA.. ఢిల్లీలో మూడొంతుల మంది పాక్ నుంచే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల ఆయుధంగా CAA.. ఢిల్లీలో మూడొంతుల మంది పాక్ నుంచే..

January 25, 2020

Amit Shah.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) ద్వారా ఓట్లు రాబట్టేందుకు వ్యూహం రచించారు. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మూడొంతు మంది పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే ఉన్నారంటూ సరికొత్త చర్చను లేవనెత్తారు. 

పాక్ నుంచి వచ్చిన శరనార్థులకు తాము ఆశ్రయం కల్పిస్తామని వెల్లడించారు. పాక్ నుంచి వచ్చిన శరనార్థులకు రక్షణగా పౌరసత్వం ఇచ్చేందుకు CAA చట్టం తీసుకువస్తే  దాన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీపార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు దీన్ని గ్రహించాలని సూచించారు. ముస్లింలను రెచ్చగొట్టి CAAకు రెండు పార్టీలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని అన్నారు. అల్లర్లు చెలరేగేలా కాంగ్రెస్ పార్టీ చూస్తుందని పేర్కొన్నారు.