లాలూ కొడుకు చెంప పగలగొడితే కోటి - MicTv.in - Telugu News
mictv telugu

లాలూ కొడుకు చెంప పగలగొడితే కోటి

November 25, 2017

మన రాజకీయ నాయకుల వద్ద కోట్లు మూలుగుతున్నది ఉంది వాళ్ల ప్రకటనలు చూస్తుంటే. తలలు నరికితే 10 కోట్లు ఇస్తానని ఒక మంత్రి అంటాడు. కాళ్లూచేతులూ తీసేస్తే 5 కోట్లు అని ఒకడు అంటాడు. తాజాగా బిహార్ నేతలూ ఈ రివార్డుల బాట పట్టారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చెంప పగలగొడితే కోటి రూపాయలు ఇస్తానని కాషాయదళ నేత అనిల్‌ సాహ్ని శుక్రవారం ప్రకటించాడు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీపై తేజ్ ప్రతాప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సుశీల్ అక్రమాలలు బయటపెట్టి, ఆయన చెంప పగలేస్తానని అన్నాడు. దీనిపై సాహ్ని స్పందించాడు. ‘తేజ్ ప్రతాప్.. సుశీల్ చెంపను పగలగొట్టకముందే అతని చెంప పగలగొడితే కోటి పాయలు బహుమతిగా ఇస్తాం’ అని చెప్పాడు. తేజ్‌ క్షమాపణ చెప్పకపోతే అతని ఇంటి ముందు ధర్నా చేస్తామన్నాడు. ఈ గొడవ చినికిచినికి గాలీవానాగా మారనుంది. సుశీల్ కొడుకు పెళ్లికి తాను వెళ్తున్నానని, అక్కడ గొడవ జరిగితే అందుకు బాధ్యత సర్కారుదేనని హెచ్చరించాడు.