పాపం టిక్‌టాక్ స్టార్.. చిత్తుగా ఓడిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

పాపం టిక్‌టాక్ స్టార్.. చిత్తుగా ఓడిపోయింది..

October 24, 2019

BJP TikTok Star Sonali Phogat Loses In Elections

టిక్‌టాక్‌లో ఓ రేంజ్‌లో పర్ఫామెన్స్ కనబరిచిన సోనాలి పొగట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. హరియాణాలోని అడంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టింది. కానీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకున్నారు. టిక్‌టాక్‌లో ఆధిరించని వారు ఆమెను ఎన్నికల సంగ్రామంలో ఆదరించలేకపోయారు. 

కాగా సోనాలి పొగట్‌పై విజయం సాధించిన కుల్దీప్ బిష్ణోయ్ మూడుసార్లు అడంపూర్ నుంచి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆమెపై 30వేల మెజార్టీతో బిషోయ్ గెలుపొందారు. ఆయనకు  64వేల రాగా.. సోనాలికి 30వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. బిషోయ్ కుటుంబం 50 ఏళ్లుగా అడంపూర్ నియోజకవర్గాన్ని కంచుకోటలా ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో సోనాలి చేసిన వ్యాఖ్యలు అందరిని విస్మయానికి గురిచేశాయి.తనను గెలిపిస్తే దేశం కోసం టిక్ టాక్ చేస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.