సంఘ్ ప్రశ్నకు.... ఇదీ సమాధానం...... - MicTv.in - Telugu News
mictv telugu

సంఘ్ ప్రశ్నకు…. ఇదీ సమాధానం……

July 25, 2017

 

కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ వెరీ ఈజీగా ఉంటాయి. అందరికీ తెల్సిన  జవాబులే. ప్రశ్నలూ అంతే. కకా పోతే ఉన్నదున్నట్లు ఆన్సర్ రాయోద్దు. అట్లా రాస్తే ఒక్కటంటే ఒక్క మార్కు కూడా రాదు. పేపర్ దిద్దే వాళ్లుకు నచ్చినట్లు రాస్తే గనుక మార్కులే గాదు పే…..ద్ద స్మనాలు కూడా అందుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 10 లక్షల మంది విద్యార్థులకు బిజెపి పరీక్ష పెట్టబోతున్నది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా….. ఒకే ఒక్క ప్రశ్న… అది. ఇదిగో ఇదీ…….

ప్ర: మోడీ,  యోగీ ఆదిత్యనాధ్, ఆర్ఎస్ ఎస్ గురించి మీకేం తెలుసు.?

జ: చానా తెల్సు కాక పోతే పేజీలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలకే పరిమితమై… మరింత తక్కువ లైన్లతో ఆన్సర్ ఇస్తాను.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు.దేశంలో ఏదో జరుగుతుందని స్విస్ బ్యాంకులో జమైన  నోట్లన్నీ తెచ్చి ఒక్కోరి అకౌంట్లో 15 వేల రూపాయలేస్తామని అన్నారు.  కోట్ల సంఖ్యలో జన్ ధన్ అకౌంట్లు తెరిపించారు. అందులో ఒక్కటంటే ఒక్క పైసా కూడా  వేయలేదు. వెయి  కండ్లతో ఎదురు  చూసిన జనం…. పెద్ద నోట్ల రద్దు తర్వాత  నెలల తరబడి ఎటిఎంల ముందు క్యూలు కట్టారు. బ్యాంకుల ముందు బార్లు బార్లు నీల్గారు. అంతేకాదు పెద్ద  నోట్ల రద్దు తర్వాత దేశం ఎవ్వరూ ఊహించని విధంగా ముందుకు మున్ముందుకు తోసుకు పోతుందని సెలవిచ్చారు. ముందు కాదు కద… నాలుగు అడుగులు వేనక్కి పోయిందని పార్లమెంట్ కు ప్రభుత్వం  నివేదించుకున్నది.

మోడీ వచ్చిన మూడేళ్ల కాలంలో వీలైనంత వరకు సెస్ లు పెంచారు. పన్నుల సంగతి సరేసరి.  అన్నీ కలిపి జీఎస్టీ అని ఒకే పన్ను చట్టం తెచ్చారు. అదేం చేస్తుందో ఇప్పటికీ జనాలకు అర్థం కాలేదు. బిజెపిలోఉన్న వాళ్లకైనా అర్థం అయిందో లేదో తెలియదు. మోరల్ పోలిసింగ్ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి  తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని గరించి ఏ చర్యలూ తీసుకున్నట్లు అయితే లేదు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం.

అయితే స్వచ్ఛ భారత్ పేరుతో ఏసీ రూంల్ల ఉన్న సెలబ్రిటీలతో ఫోటోలకు ఫోజుల కోసమైనా వీధుల్లోకి తెచ్చారు మోడీ. ఆ తర్వాత రోడ్లపై చెత్త… చెదారం అట్లాగే ఉంది. ఈ దేశంలో ఏ మూలకు వెళ్లి చూసినా  కన్పిస్తది. యోగీ ఆదిత్య నాథ్  గురించి చెప్పాల్సిందేమీ లేదు. అంతా అనుభవంలో చూస్తున్నది. ఈ దేశానికి కాబోయే ప్రధాన మంత్రి యోగీ అని వారసత్వాన్ని చెప్పకనే చెప్పారు.

ఇక ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే… కులాన్ని వ్యతిరేకించిన…అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యాన్నిచీల్చి చెండాడిన అంబేద్కర్ ను భుజాల కెత్తుకున్నది. ఈ దేశంలో దళితులపై దాడులు  చేసినా.. హత్యలు… అత్యాచారాలు… జరుగుతున్నా పట్టించుకోకుండా… సంఘ్  నాయకులు హితబోధలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఎత్తేయాలని సెలవిస్తున్నారు.  ఇంకో వైపు అమిత్ షా లాంటి వారు బయట వంటలు చేసుకుని దళితుల ఇండ్లలకు తెచ్చుకుని  భోజనాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నుండి పుట్టుకొచ్చిన నాయుడు యడ్యూరప్ప ఏం చేశాడో….కర్నాటకల అందరి కండ్ల ముందే కన్పించింది. ఇక మీ అందరి  గురించి  ఇప్పటికైతే ఇది చాలు. మళ్లీ ఎన్నికల నాటికి  మీరు ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం మళ్లీ అప్పుడు చూద్దం.