6 చోట్ల పోటీ చేసి 4 స్థానాల్లో బీజేపీ ఘన విజయం - MicTv.in - Telugu News
mictv telugu

6 చోట్ల పోటీ చేసి 4 స్థానాల్లో బీజేపీ ఘన విజయం

November 7, 2022

 

BJP wins 4 out of 6 assembly seats in the byelections held in 6 states

 

దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదిన ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. విపక్షాలకు 3 సీట్లు దక్కాయి. మహారాష్ట్రలోని తూర్పు అంధేరీలో తప్ప మిగతా 6 సీట్లలో బీజేపీ బరిలోకి దిగింది. నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అదంపూర్ (హర్యానా), గోలా గోకర్నాథ్ (ఉత్తరప్రదేశ్), గోపాల్ గంజ్ (బీహార్), ధామ్ నగర్ (ఒడిశా) స్థానాల్లో బీజేపీ గెలిచింది.

 

అయితే, తెలంగాణలోని మునుగోడులో బీజేపీకి ఓటమి ఎదురైంది. హోరాహోరీ పోరులో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అటు, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో రుతుజా లట్కే గెలిచారు. రుతుజా లట్కే… ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేన పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక బీహార్ లోని మోకమా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిని విజయం వరించింది. కాంగ్రెస్‌ 3 స్థానాల్లో పోటీచేసి 3 చోట్లా పరాజయం పాలైంది.