Bjp ysr congress parties clash in Andhra Pradesh Dharmavaram
mictv telugu

బీజేపీ నేతలపై వైకాపా కార్యకర్తల దాడి. రక్తగాయాలతో..

June 28, 2022

Bjp ysr congress parties clash in Andhra Pradesh Dharmavaram

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు మాటలకు, తిట్లకు మాత్రమే పరిమితమైన వైకాసీ, బీజేపీల నేతల ఆగ్రహావేశాలు శ్రుతిమించాయి. బీజేపీ నేతపై అధికార పార్ట కార్యకర్తలు దాడి చేశారు. బాధితులు రక్తగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది .
ఏం జరిగిందంటే.. ఒకపక్క వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం జరుగుతుండగా, మరో పక్క మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనాయణ విలేకర్ల సమావేశం పెట్టారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. అదే సమయంలో అక్కడికి మూడు వాహనాల్లో చేరుకున్న వైకాపా కట్టెలు, ఇనుప రాడ్లతో ప్రెస్‌క్లబ్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న బీజేపీ నాయకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పట్టణంలో ఉద్రిక్త వాతావరణ నెలకొనడంతో పోలీసు అప్రమత్తమయ్యారు.