అమిత్‌షా, ప్రశాంత్ కిశోర్ భేటీ అబద్ధం.. ప్రశాంత్ టీం - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్‌షా, ప్రశాంత్ కిశోర్ భేటీ అబద్ధం.. ప్రశాంత్ టీం

March 17, 2018

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం సాయంత్రం ఢిల్లీలో కలిశారని, పొత్తుపై చర్చించారని వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ టీమ్ తీవ్రంగా ఖండించింది. తప్పుడు ప్రచారం, బురదజల్లడంతో భాగంగా ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని ఆరోపించింది.

అమిత్ షా, ప్రశాంత్ కిశోర్ మధ్య ఎలాంటి సమావేశమూ జరగలేదని, అసలు ప్రశాంత్ కిశోర్ ఢిల్లీకే వెళ్లలేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో బీజేపీ, వైకాపా మధ్య పొత్తు ఉంటుందన్న వార్తలకు తెరపడింది.