విదేశీయురాలికి పుట్టిన రాహుల్ దేశభక్తుడు కాలేడు.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

విదేశీయురాలికి పుట్టిన రాహుల్ దేశభక్తుడు కాలేడు.. బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్

June 29, 2020

‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడు’ అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై  బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనాతో ఘర్షణ అనంతరం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.  ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో  దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి?’ అని  ఆమె ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపణలు గుప్పించారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలని.. వారికి ఎలా మాట్లాడాలో తెలియదని దుయ్యబట్టారు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవని అన్నారు.  

అయితే ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా స్పందించారు. ‘ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ ఎంపీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారు. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీ గురించి.. రాహుల్‌ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజ్ఞా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలి’ అంటూ ధనోపియా ఆగ్రహం వ్యక్తంచేశారు.