బీజేపీ ఆయుధం మిస్సైంది..!
తెలంగాణ బీజేపీ బ్రహ్మాస్త్రం మిస్సయింది. అవును నిజం.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం.బేరసారాల ఎపిసోడ్ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎత్తుకుపోయింది. ఎన్ని ఎంక్వైరీలు వేసినా అది ఎప్పటికీ దొరికదేమో.!ఎందుకంటే…
పాయె అస్త్రం పాయె…
తెలంగాణ బీజేపీ నేతలు పొద్దున లేస్తే ఒకటే మాట. టీఆర్ఎస్ సర్కార్‌ని తిట్టాలంటే ఆ పదం ఉండాల్సిందే. ఆ పదం లేకుండా ఏ నేత మాట్లాడలేరు.ఆఖరుకు ఢిల్లీ నేతల స్పీచ్ దాన్నే చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు గుర్తువస్తుంది కదా ఆ పదం..అదేనండి ఫామ్‌హౌజ్.సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్ పై తెలంగాణ బీజేపీ నేతలు చేయని విమర్శ అంటూ లేదు. అక్కడ వుండి పాలనను పడుకోబెట్టారని పలుమార్లు విమర్శించారు. ఫామ్‌హౌజ్ ముఖ్యమంత్రి అంటూ విరుచుకుపడేవారు. కానీ మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌తో బీజేపీ ఇక పేరెత్తలేదు. ఒకవేల ఆ పేరు తీస్తే జనానికి ఠక్కున గుర్తొంచేది మొహనాబాద్ ఫామ్‌హౌజే.ఎందుకంటే జనం కళ్ల ముందు దృశ్యాలు కదలాడుతున్నాయి. చూడని దానికన్నా..కళ్లరా చూసిన జ్ఞాపకాలే ఎక్కువకాలం ఉంటాయంటారు.
టీఆర్ఎస్‌కు బిగ్ రిలీఫ్..
ఎప్పటినుంచో టీఆర్ఎస్ కు , సీఎం కేసీఆర్ కు ఫామ్ హౌజ్ పదమంటే చిరాకు.పదే పదే బీజేపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అసరం లేదంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.ఎరక్కపోయి బీజేపీ ఇరుక్కుపోయిందంటూ మీమ్స్ వదులుతున్నారు.
ఫామ్‌హౌజ్ ప్రకంపం
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ప్రకంపం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్… ప్రకంపానికి వేదికైంది. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్దన్ రెడ్డికి ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రరాజు, నందు, సింహయాజులు ప్రలోభపెట్టారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు సైబరాబాద్ పోలీసులకు చెప్పారు. ఫామ్ హౌస్ లో తనిఖీ చేసిన పోలీసులు ఈ ముగ్గురునీ అదుపులోకి తీసుకున్నారు. కొనుగోళ్ల ఎపిసోడ్ పై లోతుగా విచారణ జరుపుతున్నారు.