కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి.. క్షమాపణ చెప్పాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి.. క్షమాపణ చెప్పాల్సిందే

March 30, 2022

vgfdvfd

ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు దాడి చేశారు. కశ్మీరీ పండిట్లపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించారు. మెయిన్ గేటు, సీసీ కెమెరాలు, బారికేడ్లను ధ్వంసం చేశారు. ఇంటి గోడలపై పెయింటింగ్ వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా, ఇటీవల కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ సినిమాలో చూపించిందంతా నిజం కాదని కొట్టిపారేశారు. అదంతా అబద్ధమని, బీజేపీ కావాలనే సినిమాకు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

ఆ సినిమాకు పన్ను మినహాయింపుపై స్పందిస్తూ.. ‘యూట్యూబులో విడుదల చేసుకోవచ్చు కదా. అందరూ ఉచితంగా చూస్తారని’ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేవైఎం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనలకు దిగారు. హిందువులను అవమానపరచే విధంగా మాట్లాడిన కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అనంతరం ఆప్ పార్టీ స్పందించింది. పోలీసుల సహాయంతో కేజ్రీవాల్ ఇంటిని ధ్వంసం చేశారు. సెక్యూరిటీని దాటి, గేట్లను కూలగొట్టి, సీసీ కెమెరాలను పగులగొట్టారని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

https://www.ndtv.com/video/news/news/cctv-video-shows-vandalism-outside-arvind-kejriwal-s-home-amid-bjp-protest-626234