కాజల్ ‘సీత’ను నిషేధించాలి: బీజేవైఎం డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

కాజల్ ‘సీత’ను నిషేధించాలి: బీజేవైఎం డిమాండ్

May 22, 2019

ఎల్లుండి విడుదల కానున్న ‘సీత’ చిత్రంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. సీతను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారని, ఆమె పేరుతో కమర్షియల్ సినిమా తీయడం సరికాదని భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాపై నిషేధం విధించాలని బీజైవైఎం హైదరాబాద్ అధ్యక్షుడు వినయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రామాయణంలోని సీత హిందువులకు ఆరాధ్య దైవమని ఆయన అన్నారు. ‘సినిమా ట్రైలర్‌లో చూపిన సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. సీత పాత్ర, ఇతర పాత్రల సంభాషణలు సీతమ్మను కించపరిచేలా ఉన్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చూపారు. క్రియేటివిటీ పేరుతో సంప్రదాయాలు, విలువలను దిగజార్చడం సరికాదు.. ’ అని ఆయన అన్నారు. తేజ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందింది. కాగా, సీత సినిమా మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువగా నచ్చుతుందని తేజ్ అంటున్నారు.