BJYM warns about standup comedian Munawar Farooqui's visit to Hyderabad
mictv telugu

ఆ కమెడియన్ హైదరాబాద్ వస్తే కొట్టి పంపిస్తాం.. బీజేపీ హెచ్చరిక

August 18, 2022

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ పర్యటన ప్రస్తుతం కాక రేపుతోంది. కామెడీ షో పేరుతో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడు ఈనెల 20వ తేదీన హైదరాబాద్లో ఓ ఈవెంట్‌ను నిర్వహించనున్నాడు. ఇప్పటికే ఆ ఈవెంట్ కోసం బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఆ షోలో పాల్గొనేందుకు టికెట్ ధరను 499 రూపాయలుగా నిర్ణయించారు.

 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మునావర్ షోకు అనుమతి ఇవ్వద్దని తెలంగాణ డీజీపీని కలిశారు బీజేవైఎం నాయకులు. నగరంలో అతడి షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా హెచ్చరించారు. హిందు దేవతలను అవమానించిన ఫారూఖీ ఈవెంట్ నిర్వహించే హాల్ ను తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను దగ్దం చేస్తామన్నారు. మునావర్ హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఆ షో కు అనుమతి ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది.

డోంగ్రీ పేరుతో స్టాండప్ కామెడీ షోలు చేసే మునావర్ ఓ షో లో సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆయనపై హిందూ సంఘాలు తీవ్రంగా ఫైరవుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే మునావర్ షోలను నిషేధించారు. తెలంగాణలో మాత్రం అతనికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు. ఈ ఏడాది జనవరిలో మునావర్ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడడంతో ఈ నెల 20 న ఈవెంట్ కు ప్లాన్ చేశారు. ఇక బీజేపీ నేతలు అతడి షో ని అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.