Black chana manages weight loss
mictv telugu

నల్ల శనగలు.. చేయును ఆరోగ్యానికి మేలు!

November 14, 2022

ఆరనీకు మా ఈ దీపం.. కార్తీక దీపం అంటూ పాటలు పాడుతున్నారా? ఉపవాసాలు, వ్రతాలు.. ఇలా బోలెడు పనులు కదా! చాలామంది మాంసాహారులు కూడా శాఖాహారులుగా మారే మాసం ఇది. మరి నాన్వెజ్లో ఉండే ప్రొటీన్లు దక్కాలంటే నల్లశనగలను నానబెట్టి అయినా తినేయమంటున్నారు డాక్టర్లు. శనగలను మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వాడం, కానీ ఉత్తర భారతదేశంలో వీటి వాడకం బాగానే ఉంటుంది.

వాటిని చపాతీలు, పూరీల్లో పెట్టుకొని బాగా లాగించేస్తుంటారు. పైగా శనగల మీద రీసెర్చి కూడా జరిగిందట. ఉదయగిరిలోని ఫుడ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ నల్ల శనగల మీద ఒక రీసెర్చ్ పేపర్ కూడా యూనివర్సిటీకి ఇచ్చాడట. దీనిలోని పోషకాలు మాంసంలో కంటే ఎక్కువ ఉంటాయని ఆయన తేల్చేశాడు. నల్ల శనగల్లో.. విటమిన్ ఎ, ప్రొటీన్లు, క్యాల్షియం, ఐరన్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు వీటిని తింటే మంచిదంటున్నారు డైటీషియన్లు. ఇవి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి కూడా వెంటనే పెరగదు. పైగా శరీరానికి కావల్సిన ప్రొటీన్లను అందిస్తాయి. కాబట్టి నిరభ్యంతరంగా హృద్రోగులు మీరు ఎంచక్కా ఒక గిన్నెలో నల్ల శనగల కూరనో, ఉడికించో లాగించేయండి. బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అయితే నల్ల శనగలను మీ డైట్లో చేర్చుకోండి. డైటీషియన్లు కూడా వీటిని తప్పకుండా ఉండి తీరాలి అంటున్నారు. లోయర్ బాడీ వెయిట్ తగ్గాలన్నా కూడా ఈ శనగలు బాగా పని చేస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ అరుగుదలను బాగా పెంచుతుంది. కాలేయ సంబంధ వ్యాధులకు శనగలు బాగా పనిచేస్తాయంటున్నారు డాక్టర్లు. ఈ అవయం పని తీరు మరింత మెరుగు పడాలంటే మాత్రం ఈ శనగలను తమ డైట్లో చేర్చుకోవాల్సిందే! అయితే ఈ శనగలను ఎలా తింటే మరింత లాభం పొందుతారో కూడా చూడండి.

శనగల కూరను తయారీ విధానం ఇదిగో..

కావాల్సినవి
శనగలు ‌‌‌‌‌‌_ 2 కప్పులు
వెల్లుల్లి _ 5
అల్లం _ చిన్న ముక్క
గుమ్మడికాయ ప్యూరీ _ ఒక కప్పు
పాలకూర ఆకులు _ ఒక కప్పు
జీలకర్ర పొడి _ చిటికెడు
మిరియాలు _ 4
బటర్ ‌‌ _ టేబుల్స్పూన్
ఉప్పు _ రుచికి సరిపడా
కొత్తిమీర _ చిన్నకట్ట
తయారీ
శనగలను కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నాలుగు కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. ఇందులో వెల్లుల్లి, అల్లం, పాలకూర వేసి కలపాలి. ఇప్పుడు పెనం తీసుకొని అందులో బటర్ వేసి కరిగించాలి. అది కరిగిన తర్వాత అందులో గుమ్మడికాయ ప్యూరీ వేసి కలపాలి. అది ఉడికిన తర్వాత జీలకర్రపొడి, మిరియాలు, ఉప్పు వేసి రెండు నిమిషాలు సన్నని సెగ మీద ఉంచాలి. దీంట్లో ఉడికించిన శనగలు వేసి కలుపాలి. మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. టేస్టీ శనగల కూర రెడీ!