Black Flags In Owasisi Meeting at Gujarat
mictv telugu

గుజరాత్‌లో ఓవైసీకి షాక్

November 14, 2022

గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్ ఓవైసీకి నిరసన సెగ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు ప్లకార్డులు చూపించారు. ఆయన సభలోనూ జై మోదీ నినాదాలు వినిపించాయి.గుజరాత్‌లో ఎంఐఎం పోటీ బీజేపీకి లాభిస్తుందా? కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలుస్తుందా? మొన్నటి ఉపఎన్నికల్లోలాగే గుజరాత్ ఎన్నికల్లో జరగబోతుందా?

ఓవైసీకి సెగ

గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఆప్ రేసులో ఉంది. పోటీ చేస్తున్న చిన్న పార్టీల్లో ఎంఐఎం ఒకటి. మైనారిటీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. వీరి తరఫున ప్రచారానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూరత్ వచ్చారు. ఆయన ప్రచారానికి కొందరు అడ్డుపడ్డారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఓవైసీ సభల్లో మోదీ,మోదీ అంటూ నినదించారు.సూరత్ ఈస్ట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వారిష్ పఠాన్‌తో కలిసి అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. ఓవైసీ ప్రసంగిస్తుండగా పలుమార్లు అడ్డుతగిలారు.

కాంగ్రెస్‌లో కలవరం
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటు బ్యాంకు ఉంది.చాలా నియోజకవర్గాల్లో వీరి ఓట్లను ఆ పార్టీ నమ్ముకుంది. ఆ నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తుండటంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. ఎంఐఎం పోటీ బీజేపీకే లాభం చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.ముస్లిం మైనారిటీ ఓట్లు చీలితే బీజేపీకి ప్లస్ అవుతుంది. మైనారిటీలు ప్రభావం చూపే సెగ్మెంట్లపైనే ఎంఐఎం కన్నేసింది.

ఎంఐఎం ఉండగ..

దేశంలో బీజేపీకి చాలా రాష్ట్రాల్లో తిరుగులేదు. గత ఎన్నికల నుంచి మొన్నటి ఉప ఎన్నికలదాకా ఇదే రుజువైంది. బీజేపీ డౌట్ ఉన్న సీట్లను ఎంఐఎం గెలిపిస్తుంది. యూపీ నుంచి బీహార్‌లో మొన్న జరిగిన బైపోల్ దాకా ఇదే జరిగింది. మైనారిటీల ఓట్లను గంపగుత్తగా ఎంఐఎం చీలిస్తుంది. ఈ ఓట్లనే నమ్ముకున్న పార్టీలకు నష్టం కలుగుతుంది. పరోక్షంగా బీజేపీకి ప్లస్ అవుతోంది. అందుకే ఎంఐఎం పోటీ చేసే సీట్లపై బీజేపీ చాలా ధీమాగా ఉంటుంది.