Black Friday the story behind the popular shopping festival
mictv telugu

అతి పెద్ద షాపింగ్ ఫెస్టివల్ ఈ రోజే!

November 25, 2022

Black Friday the story behind the popular shopping festival

థాంక్స్ గివింగ్ నిన్న జరుపుకొన్నారు. ఈ రోజు బ్లాక్ ఫ్రైడే! మనకేమో కానీ ఈరోజు షాపింగ్ ప్రియులకు పెద్ద పండుగే! మన దగ్గర కూడా కొన్ని వెబ్సైట్స్ డీల్స్ ఇస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి.
ఇండియాలో ఈ మధ్య కాలంలో బ్లాక్ ఫ్రై డే అంటూ కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు డీల్స్ మొదలుపెట్టాయి. కానీ యూఎస్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వాల్ మార్ట్, మింత్ర ఇప్పటికే అనేక డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక షాప్ ల్లో అయితే ఈ రోజు జనాలు బారులు తీరుతుంటారు. సోషల్ మీడియా ఈ రోజు గురించి ఎన్నో మీమ్స్ కూడా వస్తున్నాయి.

Black Friday the story behind the popular shopping festival

ఆ రోజు..

థాంక్స్ గివింగ్ తర్వాత రోజు ఎప్పుడు షాపింగ్ ఫెస్ట్ గా మారిందో చెప్పడం కష్టం. అయితే బ్లాక్ ఫ్రైడే అనే పదం మొట్టమొదటిసారి 1869లో ఉపయోగించారట. క్రిస్మస్ షాపింగ్తో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి యూఎస్ గోల్డ్ మార్కెట్ క్రాష్ అయింది. దీనికి సూచనగా ఈ రోజు మొదలైందని అంటుంటారు. దీని ప్రభావం యూఎస్ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. ఫిలడెల్ఫియా పోలీసు అధికారులు తమ హాలిడే షాపింగ్‌ను థాంక్స్ గీవింగ్ తర్వాత రోజే చేశారట. పెద్ద సంఖ్యలో సబర్బన్ నగరంలోకి వచ్చినప్పుడు ఆ రోజును బ్లాక్ ఫ్రై డేగా నిర్ణయించారని నమ్ముతారు. ఇది పక్కన పెడితే.. 1980లో ఈ పదం మరింత ప్రాముఖ్యత పొందింది. మామూలు దుకాణదారులు ఏడాది పొడవునా నష్టపోతుండడంతో ఒక ఈవెంట్ ఉండాలని భావించారు. అందుకే థాంక్స్ గీవింగ్ తర్వాత రోజు ఎంచుకున్నారు.

Black Friday the story behind the popular shopping festival

బ్లాక్ ఫ్రై డే చాలామంది రిటైలర్లకు ముఖ్యంగా బొమ్మలు, గేమ్ స్టోర్ లకు చాలా అవసరం. 2017 నుంచి 2021 వరకు రిటైలర్లకు సుమారు 19శాతం లాభం వచ్చిందని ఒక నివేదిక తెలుపుతుంది. ఆ రోజు ఉదయమే షాప్ లను తెరుస్తారు. డీల్స్ అందించే షాప్ లలో అయితే బారులుగా నిలబడతారు. 2000 సంవత్సరం తర్వాత ఫిజికల్ స్టోర్స్ తో పోటీపడేందుకు ఆన్లైన్ లో కూఆ ఈ డీల్స్ ని ప్రారంభించారు. దాంతో మరింత ప్రజాదరణ పొందిందీ రోజు.