రాకేశ్‌ టికాయత్‌పై దాడి.. నల్లసిరా చల్లిన దుండగులు - MicTv.in - Telugu News
mictv telugu

రాకేశ్‌ టికాయత్‌పై దాడి.. నల్లసిరా చల్లిన దుండగులు

May 30, 2022

సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్‌పై సిరా దాడి జరిగింది. బెంగళూరులో రైతు సంఘాల సమావేశానికి హాజరైన ఆయనపై కొందరు ఇంక్ పోశారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరా దాడి చేసిన వారిని అడ్డుకుని, కొట్టారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సిరా దాడిపై తీవ్రంగా స్పందించారు రాకేశ్ టికాయిత్. తన కార్యక్రమానికి స్థానిక పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిందన్నారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇంక్ చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాట్లు తెలిపారు. రైతు సంఘాలకు చెందిన మరో వర్గమే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలం టికాయత్‌ వర్గానికి, చంద్రశేఖర్‌ వర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ దాడికి మరో రైతు వర్గమే కారణమని తెలుస్తోంది.