పాకిస్తాన్‌కు గ్రహాంతరవాసులు వచ్చారంట.. ఫొటో వైరల్!  - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌కు గ్రహాంతరవాసులు వచ్చారంట.. ఫొటో వైరల్! 

January 22, 2020

bhbhh

పాకిస్తాన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. లాహోర్‌ ఆకాశంలో నల్లటి రంగులో పెద్ద వలయం ఏర్పడింది. వేలాడుతున్నట్టుగా వలయం ఉండటంతో దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న విపరీత పరిణామాలేనని కొంత మంది పేర్కొంటున్నారు. 

ఈ ఘటనపై ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇదంతా ఏలియన్స్ పనే అంటూ పేర్కొంటున్నారు. ఏలియన్స్ భూమి మీదుకు వస్తున్నారని, కానీ వాళ్లు మాత్రం పాకిస్తాన్‌లో దిగరని, అమెరికాలో దిగుతారంటూ స్పందించారు. మరి కొందరు బాణాసంచా కాల్చడం వల్ల ఏర్పడిన పొగ ఇలా వలయంగా ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 లో చికాగోలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పేల్చడంతో ఇది సంభవించిందంటున్నారు. 2013లో ఫ్లోరిడాలో బాణసంచా కారణంగా ఇలా జరిగింది. 2015 లో కజకిస్థాన్‌లోనూ ఇలాగే వలయం ఏర్పడి 15 నిమిషాల తర్వాత మాయమైనట్టు వెల్లడించారు.