నాది ఏ కులం కాదు ! - MicTv.in - Telugu News
mictv telugu

నాది ఏ కులం కాదు !

June 3, 2017

‘ నేను ఏ కులపోణ్ణి కాను ‘ అని మనుషులందరు ప్రకటిస్తే ఎట్లుంటది ?

ఈ రిజర్వేషన్లు, అంటరానితనాలు, ఎక్కువ తక్కువలు అస్సలు ఉండవేమో !?

అలాంటి ఒక ప్రహసనాన్ని కేరళలో ఇద్దరు లీడర్లు తీస్కొచ్చారు. సిపిఐ ఎంపి ఎంబీ రాజేష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటి బలరాంలు కలిసి ఈ పని చేసారు. ఇలా చేసామని వాళ్ళు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించడంతో కేరళ రాష్ట్రంలో ఒకింత ఆశ్యర్యం వ్యక్తమైంది చాలామందిలో !?
తమ పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫాంలో క్యాస్ట్ కాలమ్ ను అలా బ్లాంక్ గానే వదిలేసారటఇదేందని యాజమాన్యం ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఇప్పుడు చాలా ఇంట్రెస్టును క్రియేట్ చేసింది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తిందనే చెప్పుకోవాలి.ఇంత చిన్న వయసులో వాళ్ళకి కులం వాసనెందుకు ? మతం ముసుగులో వాళ్ళనెందుకు ఊపిరాడనీయకుండా చెయ్యాలని ఎదురు ప్రశ్నించారు ?పెద్దయ్యాక వాళ్ళే వాళ్ళకీ నచ్చిన కులాన్ని ఫిల్ చేస్కుంటారని చెప్పారు. మన దేశంలో కులమతాలకి కొదవ లేదు గాబట్టి చూసింగ్ చాయిస్ వాళ్ళకే వదిలేసామన్నారు.నిజమే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో గొప్ప మతలబు వుంది… చదువుకుంటే పిల్లలు సంస్కారం నేర్చుకుంటారంటారు ఆ సంస్కారంతో పాటు కుల పిచ్చిని కూడా చిన్నప్పటి నుండే నూరి పోస్తున్నారు కన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చుట్టూ సమాజం…, నీది ఆ మతం , నీది ఈ మతమని చదువుతో పాటే ఓనమాలు దిద్దిస్తున్న అన్య మతాల ధర్మ దేశం మనది. మనిషి ముందు పుట్టాడో ? మతమే ముందు పుట్టిందో అస్సలు అర్థం కాదు ??

కులమతాలతో వృత్తులను పంచుకున్నాం. అదే పేరుతో దైవాలను మనం పంచుకున్నామో వాళ్ళే వాళ్ళ మెజారిటీని పెంచుకోవడానికి ఇలా మనుషుల్ని వివిధ వర్గాలు,వర్ణాలుగా విభజించారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బడి మాత్రమే కాదు గుడికెళ్ళినా, మసీదు, చర్చిలకెళ్ళినా ఒక వర్ణంగానే వెళుతున్నాం తప్ప మనుషులందరిదీ ఒకటే జాతి కదా.. అలా ఒక జాతిగానైనా కొట్టుకు చచ్చుంటే బాగుండు. ఇలా క్యాస్ట్ ఫీలింగులతో ఒకరి మనోభావాలను ఒకరు దెబ్బ తీస్కుంటూ, దెబ్బలాడుతూ ఎంత కాలం కొట్టుకు చస్తారు ? కులమతాలు‌, రిలీజియన్ ప్రస్తావన లేకుండా మన వ్యవస్థ ముందుకు సాగదేమో. ఎందుకంటే మన వ్యవస్థ గట్టి పునాదులను నిర్మించుకుంది వాటి మీదే కదా… ఒకవేళ చిన్నప్పట్నించీ ఒక కులం బౌండరీలో వున్నా మధ్యలో వేరే కులం వాళ్ళు మత మార్పిడి చేయరని గ్యారెంటీ లేదని కాబోలు వాళ్ళలా పిల్లల్ని బ్లాంక్ గా పెంచాలనుకుంటున్నారేమో !? వేన్నూళ్ళుకున్న ఫ్యూడల్ భావజాలపు పిచ్చిని అంతమొందించాలని గాని నడుం కట్టారేమో ??