అంధుడిపై మతవేధింపులు.. ఎటుపోతున్నాం..! - MicTv.in - Telugu News
mictv telugu

అంధుడిపై మతవేధింపులు.. ఎటుపోతున్నాం..!

March 30, 2018

పశ్చిమ బెంగాల్ మతఘర్షణలతో అట్టుడుకుతోంది. మతం కంటే మానత్వం గొప్పదన్న సంగతి మరచిపోయి అల్లరిమూకలు దాడులకు దిగుతున్నాయి. ఒక వృద్ధ అంధుడిని కొందరు వేధించి ‘జై శ్రీరామ్’ అని, మాతరం అని పలకాలని పీడిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన ఆరోగ్యం బాగాలేదని, కనీసం నడవలేనని ఆ ముస్లిం వృద్ధుడు బతిమాలుకుంటున్నా వినకుండా వేధించారు. అతని భార్య వేడుకున్నా పట్టించుకోలేదు. గుడ్డోణ్నయ్యా, వదిలేయండయ్యా అంటూ అతడు వేడుకుంటున్నా వినిపించుకోకుండా అమావవీయంగా ప్రవర్తించారు. ‘గుడ్డోడివే, మాకు తెలుసు. నువ్వు చూడలేవు. కానీ నోరేమన్నా పడిపోయిందా. జైశ్రీరామ్ అని.. అంటావా లేదా..’ అంటూ అతని చేతితో కాషాయ జెండా పెట్టి వేధించారు. ఎంత బతిమాలినా వారు వేధించడం మానకపోవడంతో ఆ భిక్షకుడు వారు చెప్పినట్లే అనేసి వెళ్లిపోయాడు. ఈ హృదయవిదారక ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.