వాలంటైన్ డే సందర్భంగా ఎక్కువ మంది గులాబీ పూలను గిఫ్ట్‌గా ఇచ్చుకుంటారు. దాంతో సాధారణంగా దాని అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. అంతేకాక ఆ వారంలో టెడ్డీ డే, చాక్లేట్ డే, ప్రపోజ్ డే, వాలంటైన్ డే అంటూ వరుసగా వేడుకలు చేసుకుంటారు. ఆయా రోజులను బట్టి టెడ్డీలు, చాక్లేట్లు, పూలు అమ్ముడుపోతాయి. ఈ సారి గిఫ్ట్ కార్డులు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. అయితే వీటన్నింటినీ ఓ ప్రొడక్ట్ మించి రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించింది.
అది అందరూ ఊహించినట్టు కండోమ్‌లే ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో ముందుందని బ్లింకెట్ సంస్థ వ్యవస్థాపకులు అల్బిందర్ ధిండా గణాంకాలతో సహా వెల్లడించారు. కండోమ్ తర్వాతి స్థానంలో క్యాండిల్స్ ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్ముడుపోయిన కండోమ్స్, క్యాండిళ్ల వివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే కండోమ్స్ అమ్మకాలు 22 శాతం, వ్యక్తిగత లూబ్రికెంట్స్ సేల్స్ 61 శాతం పెరిగాయి. దీనికి మరో అంశం దోహదం చేసింది. ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజుకు ఒక్కరోజు ముందు అంతర్జాతీయ కండోమ్ డే వచ్చింది. దీంతో ఆర్డర్లు భారీగా పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.