రష్యా అధ్యక్షుడికి బ్లడ్ కేన్సర్: క్రిస్టఫర్ స్టీల్ - MicTv.in - Telugu News
mictv telugu

రష్యా అధ్యక్షుడికి బ్లడ్ కేన్సర్: క్రిస్టఫర్ స్టీల్

May 16, 2022

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే తెలియని వారుండరు. ప్రపంచ దేశాల అధ్యక్షులు యుద్ధం వద్దు – శాంతే ముద్దు అని చెప్పిన వినకుండా ఉక్రెయిన్ దేశంపై యుద్దం ప్రకటించి, తీవ్ర విమర్శలకు గురైయ్యాడు. ప్రస్తుతం పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి ఓ రహస్య విషయాన్ని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు.

గతకొన్ని రోజులుగా వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు? ఆయనను ప్రాణాంతక బ్లడ్ కేన్సర్ వేధిస్తుంది? అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

”పుతిన్‌కు వచ్చిన ఆ అనారోగ్యం నయమయ్యేదో, కాదో కూడా తెలియదు. రష్యాతోపాటు ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నాడు. రష్యా కుబేరుడు కూడా ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌‌పై యుద్ధ ప్రకటనకు ముందే ఆయనకు కేన్సర్ చికిత్సలో భాగంగా వెన్నుకు ఆపరేషన్ జరిగింది. పుతిన్‌తో నాకు సన్నిహిత సంబంధం ఉందని, అతడు తీసుకున్న ఓ పిచ్చి నిర్ణయం వల్ల ఈ రోజు ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది”.