చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా….అయితే రక్తాన్ని దానం చేయడం. ఏంటీ రక్తం దానం చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుందా…పిచ్చా అనుకుంటున్నారా….నిజమేనండీ. మీరు చదివినది అక్షరాలా నిజం. చర్మ సౌందర్యం మెరుగు పడాలన్నా, ముడతలు రాకుండా ఉండాలన్నా తరచుగా రక్తాన్ని దానం చేయాలిట.
దీనివల్ల చర్మం మందం, స్కిన్ పైపోర కింద ఉండే కొలాజెన్ మొతాదు పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ముడతలు రావడానికి కారణమయ్యే విషయాలూ మారుతున్నాయట. ఇంకా చర్య వాపుకు కారణమయ్యే జన్యువుల యాక్టివ్ నెస్ తగ్గడం, కొలాజెన్ తో ముడిపడిన జన్యువలు యాక్టివినెస్ పెరగడం కూడా జరుగుతోందట.
ఇవన్నీ వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకు రాకుండా చూసేవే. రక్తాన్ని ఇవ్వడం వలన ఐరన్ నిల్వ తగ్గుతాయని, దానివల్ల స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుందని అంటున్నారు. వృద్ధాప్యం రావడానికి ఐరన్ నిల్వ మరీ ఎక్కువ అవడం కూడా ఒక కారణం. ఇది వయసుతో పాటూ వచ్చే సమస్యలకూ దారి తీస్తుంది.