దేశ రాజకీయాలపై కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేసీఆర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశం దారి తప్పుతోంది. దుర్మార్గమైన పనులు దేశంలో జరుగుతున్నాయి. కర్నాటకలో మతకల్లోలాలు రేపారు. ఆడ పిల్లలు అక్కడ చదవాలంటేనే భయపడుతున్నారు. దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. మతకల్లోలాలు జరిగితే ఎవరైనా ఇక్కడ పరిశ్రమలు పెడతారా?. ఇలాంటి పనులు దేశానికి మంచిది కాదు. ఆ క్యాన్సర్ని విస్తరించరాదంటే ఎక్కడికక్కడ నరికి నలిపేయాలి” అని సీఎం కేసీఆర్ . జాతీయ రాజకీయాలు ప్రభావితం జరిగేలా మందుకెళ్తున్నానని, హైదరాబాద్ ఐటీ పెరుగతోందని పేర్కొన్నారు.
అంతేకాకుండా మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, మన కలలు కన్న తెలంగాణ రాష్ట్రంలో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నామన్నారు. ఇదేవిధంగా కొత్త బంగారు భారతదేశాన్ని చూడాలని ఉందని, అందుకోసం నా రక్తాన్ని ధారపోస్తానని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.