చెత్త ఐడియా జీవితాన్నే మార్చేసింది ? - MicTv.in - Telugu News
mictv telugu

చెత్త ఐడియా జీవితాన్నే మార్చేసింది ?

August 3, 2017

‘ ఒక ( చెత్త ) ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని ’ బాగా నమ్మినట్టున్నాడు విక్రమ్ గౌడ్. అదే ఐడియా జీవితాన్ని డిస్టబ్ చేస్తుందని పాపం కల్లో కూడా వూహించి వుండడు ? కొన్నంతే మనమొకటి అనుకుంటే అవి క్వైట్ ఆపోజిట్ వెర్షన్లో రిజల్ట్స్ ని చేదుగా, ఘాటుగా ఇస్తాయి ? కాంగ్రెస్ మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గారి పుత్రరత్నం విక్రమ్ గౌడ్ గారు వేసిన పథకం ఘోరంగా అట్టర్ ఫ్లాపై ఇప్పుడతడు కటకటాల పాలవడానికి కారణమైంది ? కాల్పుల కేసులో పోలీసులు అతణ్ని నిందితునిగా తేల్చి అరెస్ట్ చేసారు. మొదటి నుండి పోలీసులు అతని మీద అనుమానంగానే వున్నారు. వాసన చూసి పసిగట్టగల పోలీసులను పక్కదోవ పట్టించడం అంత సులభం కాదు కదా. పైరవీ చేసారు. అసలు ఈ క్రైం కథా రచయిత ఎవరన్నది పక్కా ఆధారాలతో కనుగొన్నారు. దాని అమలు కోసం విక్రమ్ పడ్డ జాగ్రత్తలన్నీ జెర్రీలై కుట్టినట్టే వుంది వ్యవహారం. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నతణ్ని వీల్ చైర్ మీదే నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. పోలీసులను తన వండర్ ఐడియాతో పక్కదోవ పట్టించినందుకు, అక్రమ ఆయుధాన్ని కలిగి వుండటం వల్ల విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేస్తున్నామని పోలీస్ కమీషనర్ ఎం. మహేందర్ రెడ్డి తెలిపారు.

ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి రెండు సినిమాలను నిర్మించిన విక్రమ్ గౌడ్ సినీఫక్కీలో బురిడీ కొట్టిద్దామని వేసిన స్కెచ్ సూపర్ ఫ్లాపైంది ? అటు అప్పులోల్లను, ఇటు అప్పు ఇవ్వాల్సిన వాళ్ళను ఈ దెబ్బతో సెట్ చెయ్యొచ్చనుకున్నాడు. గోషామహాల్ నియోజక్ వర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలంటే జనాల్లో తన మీద సింపతీ క్రియేట్ కావాలి సో.. ఈ మాస్టర్ ప్లాన్ వేసాడు విక్రమ్ గౌడ్. ఒక్క దెబ్బకి మూడు పిట్టలు కొట్టాలనుకున్న అతని పన్నాగం తనకే రివర్సై కాటేసింది ? అతనికి ఈ ప్లాన్ లో సహకరించిన ఆరుగురు నిందితులను కూడా అరెస్టు చేశారు. ‘ క్లాప్ బోర్డ్ ’ పేరుతో వున్న తన సినీ నిర్మాణ సంస్థ నుండి గత రెండు నెలల క్రితం రాస్కున్న ఈ ఫ్రాడ్ స్టోరీ ఫ్లాపైంది. కొడుకు మీద ఇంత జరుగుతున్నా తండ్రి ముఖేష్ కుమార్ గౌడ్ ఇంత వరకు స్పందించకపోవడం కొసమెరుపు. గత కొంత కాలంగా తండ్రీ కొడుకులకు పడట్లేదని వినవస్తోంది. చూడాలి మరి కోర్టులో హాజరైన విక్రమ్ గౌడ్ ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు వెళ్ళగక్కుతాడో !?