ఏసీ హెల్మెట్‌తో ఎండవేడికి చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏసీ హెల్మెట్‌తో ఎండవేడికి చెక్

April 14, 2019

ఎండల కారణంగా వేసవి కాలంలో బైక్‌పై బయటికి వెళ్లాలంటేనే బయపడుతారు. అలాంటి వారు వేసవి కాలంలో కూడా బైక్‌పై హాయిగా వెళ్లేందుకు ఏసీ హెల్మెట్ అందుబాటులోకి వచ్చింది. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్ అనే ఒక చిన్న పరికరం ద్వారా సాధారణ హెల్మెట్‌ను ఏసీ హెల్మెట్‌లా మార్చుకోవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్‌ను హెల్మెట్‌కు తగిలించుకుంటే ఏసీ హెల్మెట్ అవుతుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. బ్లూస్నాప్ హెల్మెట్ కూలర్.. హెల్మెట్ లోపలి గాలిని చల్లగా ఉంచుతుంది. దుమ్ము కూడా లోనికి రానివ్వదు.

Blue snap company introduced air conditioned helmet for summer.

హెల్మెట్ కూలర్‌లో లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేసుకోవచ్చు. అలాగే హెల్మెట్‌లో చిన్న వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఏసీ ఎలా పనిచేస్తుందో.. అలాగే ఇది కూడా పనిచేస్తుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్ ముందు భాగంలో కిందివైపు ఈ పరికరాన్ని అమర్చుకోవలసి ఉంటుంది. ఇందులోని ఫ్యాన్ గాలిని వాటర్ ఫిల్టర్ గుండా లోనికి పంపిస్తుంది. ఫిల్టర్ ఎక్కువసేపు తేమను అలాగే పట్టిఉంచుకోగలదు. అందువల్ల రైడ్‌కు బయలుదేనిర ప్రతిసారి రిజర్వాయర్‌ను నీటితో పింపుకోవలసిన అవసరం లేదు. వేగ హెల్మెట్ డీలర్‌షిప్స్ లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ బ్లూస్నాప్ హెల్మెట్‌ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.2,299.