Blue Tick will be available again from 29th of this month.
mictv telugu

ఈనెల 29నుంచి మళ్లీ ట్విట్టర్ బ్లూటిక్

November 16, 2022

ట్విట్టర్‌ను దక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ అటు ఉద్యోగులను, ఇటు యూజర్లను తికమక పెట్టేస్తున్నాడు. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న కొన్ని రోజులకే ఉద్యోగులను తొలగించి షాక్ ఇవ్వగా.. ఇక యూజర్లకు కొత్త రూల్స్‌ పెట్టాడు. అందులో ప్రధానంగా బ్లూ టిక్ విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నాడు. ట్విటర్‌లో డబ్బులు చెల్లించి ఇక ఎవరైనా బ్లూ టిక్ పొందేలా ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చారు. అయితే దాని కారణంగా నకిలీ ఖాతాల రూపంలో ఇబ్బందులు తలెత్తాయి. దీనిని గ్రహించిన ట్విట్టర్ కొన్ని రోజులుగా బ్లూటిక్ ను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ బ్లూ టిక్ ప్లాన్‌ను మళ్లీ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఇంతకుముందు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు వంటి ప్రముఖులకు మాత్రమే బ్లూ టిక్ ఉండేది. కానీ ఎలాన్ మస్క్ వచ్చాక అందరికీ బ్లూ టిక్ ఇవ్వడం మొదలు పెట్టాడు. 8 డాలర్లు చెల్లిస్తే చాలు బ్లూ టిక్ లభిస్తుంది. ఫలితంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పలు కంపెనీల పేరిట ట్విటర్‌లో నకిలీ ఖాతాలతో వెలిశాయి. డబ్బులు చెల్లించి ప్రతీ ఒక్కరు ప్రముఖుల పేరిట బ్లూటిక్ తీసుకుంటున్నారు. నకిలీ ఖాతాలపై అప్రమత్తమైన ట్టిట్టర్..బ్లూ టిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా నకిలీల బెడదను తట్టుకునేలా మార్పులు చేర్పులు చేసి తిరిగి ఈ నెల 29 న బ్లూ టిక్‌ను రీలాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు.