ఒక పెద్ద చేప….పట్టి తెచ్చి వేలం వేస్తే రెండు కోట్లు వచ్చింది. వాళ్ళ అదృష్టం పండింది. ఏంటీ నమ్మడం లేదా. నిజమే. జపాన్ కేపిటల్ టోక్యోలో టొమెసు మార్కెట్లో జరిగిన వేలంలో బ్లూఫిన్ ట్యూనా చేపకు 36 మిలియన్ యెన్ల ధర పలికింది. ఆవోమోరిలోని ఓమా సముద్రం దగ్గర ఈ చేపను పట్టుకున్నారు.
అయితే ఈ చేపను పట్టుకోవడం ఇది మొదటిసారి కాదు ప్రతీ ఏడాదీ ఈ చేపను పట్టుకోవడం, దాన్ని వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతకు ముందు కూడా ఈ చేపకు ఇలానే భారీ ధర పలికింది చాలాసార్లు. 2019లో ఏకంగా 3.1 మిలియన్ డాలర్లకు బ్లూఫిన్ చేప వేలంలో పోయింది. కానీ కరోనా వల్ల దీని రేటు తర్వాత చాలా పడిపోయింది.
అన్ని చేపల్లోకి బ్లూఫిన్ చాలా స్పెషల్. దీన్ని బ్లాక్ డైమండ్ అంటారు. దీనిలో బోలెడు పోషక విలువలు ఉంటాయిట, అందుకే ఇది చాలా ప్రత్యేకం అని చెబుతున్నారు. అందుకే అంత రేటు కూడా. టోక్యోలో టొయోసు మార్కెట్ లో జరిగే ఈ చేపల వేలాన్ని జపనీస్ సుషీ చెయిన్ అయిన సూషీ జన్మాయ్ అధ్యక్షుడు కియోషి కిమురా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది వేలం మాత్రం లూక్సే సుషీ జింజా ఒనోడెరా చెయిన్ ఓనర్ హిరోషి ఓనెడోరా నిర్వహించారు. వేలంలో కొన్న ఈ చేపను ఓమోటెసాండో జిల్లాలోని ఓనోడెరా రెస్టారెంట్ లో దీన్ని వండి వడ్డిస్తారు. చాలా స్పెషల్ షాఫ్ లు మాత్రమే దీన్ని చేయగలరుట కూడా.