రాంగ్ రూట్‌లో బీఎండబ్ల్యూ..యువకుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

రాంగ్ రూట్‌లో బీఎండబ్ల్యూ..యువకుడి మృతి

November 25, 2019

Bmw car and bullet bike at novotel hotel

గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ బియోడైవర్సిటీ పార్క్ వద్ద, ట్యాంక్ బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదాలను మరువకముందే సోమవారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్‌లోని నోవాటెల్ వద్ద కారు-బైక్‌ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

అతివేగంగా దూసుకువస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బుల్లెట్‌ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అభిషేక్‌ ఆనంద్‌(26) అనే యువకుడు ఘటనాస్థలిలోనే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు. తరువాత కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను కె.అశ్విన్‌‌గా గుర్తించారు. అశ్విన్ మద్యం సేవించి, రాంగ్ రూట్‌లోనే నడపుతుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.