భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ లోను రాణించి భారత్ ను కట్టడి చేశారు. ముఖ్యంగా ఆ దేశ ప్రస్తుత కెప్టెన్ లిటన్ దాస్ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీం ఇండియా కీలక బ్యాట్స్ మెన్ కోహ్లీ క్యాచ్‌ను అద్భుతంగా అందుకుని మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు. షకీబ్ అల్ హసన్ వేసిన 11వ ఓవర్ నాలుగో బంతిని విరాట్ కవర్స్ లోకి ఆడగా.. లిటన్ దాస్ ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. తన కుడివైపు డైవ్ చేస్తు గాళ్లోనే క్యాచ్ పట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ నిరాశగా పెవిలియన్‌కు చేరాల్సి పరిస్థితి నెలకొంది. ఇదే ఓవర్లో కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ కూడా బౌల్డయ్యాడు. ప్రస్తుతం లిటన్ దాస్ క్యాచ్ వైరల్‌గా మారింది. ఇరు దేశాల అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చరిత్రలో ఓ సూపర్ క్యాచ్‌గా నిలిచిపోవడం ఖాయమంటున్నారు.