Boat suddenly stopped due to a technical glitch in hussain sagar
mictv telugu

హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఆగిన బోటు.. 60మంది టూరిస్టులు ‘లక్కీ ఎస్కేప్’

July 14, 2022

Boat suddenly stopped due to a technical glitch in hussain sagar

హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల 60 మందితో ప్రయాణిస్తున్న బోటు సాగర్‌ మధ్యలో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. . అయితే టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. స్టీమర్‌ బోట్ల సహాయంతో బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బుధవారం ఈ ఘటన జరిగింది. దీని గురించి ఆనంద్‌ ధర్మాన ఓ టూరిస్ట్‌ ట్వీట్‌ చేయడంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘60 మంది టూరిస్టులతో నిన్న ఓ బోటు హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లింది. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో ఇంజిన్‌ అకస్మాత్తుగా ఆగిపోయింది. టూరిజం సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్టీమర్‌ బోట్ల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

దీనిపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువైనప్పుడు ఒడ్డుకు వచ్చే సమయంలో బోటు ఇంజిన్‌ స్లో చేస్తామని, అవసరమైతే స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామని చెప్పారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లో టూరిస్ట్‌ బోటును తిప్పడం లేదని వెల్లడించారు.