అసహజ సెక్స్ కోసం వేధిస్తున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అసహజ సెక్స్ కోసం వేధిస్తున్నాడు..

September 5, 2017

ఈ సినిమా ఫీల్డులో ఎవరు ఎప్పుడు కలుస్తారో ? ఎందుకు విడిపోతారో అంతు చిక్కదు. తాజాగా బాలీవుడ్ ట్రాన్స్ జెండర్  నటి బాబీ డార్లింగ్ అలియాస్ పాకీ శర్మ తనకు విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. తన భర్త రామ్మీన్ శర్మ తనతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నాడని, మద్యం తాగొచ్చి కొడుతున్నాడని  ఆరోపించింది. శర్మ పెళ్ళైన కొత్తలోనే బాగా చూసుకునేవాడని, ఆ తర్వాత వేధింపులు మొదలు పెట్టాడని చెప్పింది. అంతేకాదు.. అతను నిత్యం తనను అసహజ సెక్సు కోసం వేధించేవాడని, రోజూ తాగొచ్చి పశువు కన్నా హీనంగా  కొట్టేవాడని తెలిపింది. తన ఆస్తులన్నీ కాజేసాడని గృహహింస కేసు కింద అతని మీద కేసు నమోదు చేసింది. ఎలాగైనా తనకు అతని నుంచి విడాకులు మంజూరు చేస్తూ, అతని చేతుల్లోకి వెళ్లిన తన ఆస్తులను తిరిగి తనకు అప్పగించాలని కోర్టును కోరింది. మగవాడిగా జన్మించి బాబీ(భల్లబ్) తర్వాత సెక్సుమార్పిడితో మహిళగా మారిపోయారు. భోపాల్ కు చెందిన శర్మను ప్రేమించ పెళ్లి చేసుకుంది బాబ్లీ.