కేసీఆర్ వల్లే గెలిచా, ఎంత కష్టపడినా గుర్తింపులేదు.. షకీల్
బోధన ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్ ఉదంతం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాలని యోచిస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. షకీల్ ఈ రోజు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో సమావేశమైన తర్వాత విలేకర్లతో మాట్లాడారు.
‘ బీజేపీలో చేరే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలో చేరికపై నిర్ణయం తీసుకుంటాను. నేను సీఎం కేసీఆర్ దయవల్లే గెలిచాను. కానీ కొందరు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు. ఎంత కష్టపడినా గుర్తింపు లేకుండాపోతోంది. నా నియోజకవర్గంలో బీజేపీ గాలి వీస్తున్నా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కవితకు మెజారిటీ ఓట్లు రావడానికి కృష్టి చేశాను.. కేసీఆర్ ఎంఐఎం నాయకుల మాటలు విని నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు. టీఆర్ఎస్‌లో ఉండలేకపోతున్నాను. అరవింద్‌తో అన్ని విషయాలు చర్చించాను. పూర్తి వివారాలు సోమవారం వెల్లడిస్తాను’ అని షకీల్ అన్నారు.