అదంతా తూచ్, జీవితాంతం టీఆర్ఎస్‌లోనే .. ఎమ్మెల్యే షకీల్  - MicTv.in - Telugu News
mictv telugu

అదంతా తూచ్, జీవితాంతం టీఆర్ఎస్‌లోనే .. ఎమ్మెల్యే షకీల్ 

September 12, 2019

బోధన్ ఎమ్మెల్యే షకీల్ కామెంట్స్: తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఎమ్మెల్యే షకీల్సీఎం కేసీఆర్ నాకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారు- ఎమ్మెల్యే షకీల్సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా – ఎమ్మెల్యే షకీల్ సీఎం కేసీఆర్ నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్ – ఎమ్మెల్యే షకీల్నేను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను వీడేది లేదు- ఎమ్మెల్యే షకీల్జీవితమంతా సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటా- ఎమ్మెల్యే షకీల్నేను బతికినంత కాలం టీఆర్ఎస్ లోనే కొనసాగుతా- ఎమ్మెల్యే షకీల్మంత్రి పదవి కావాలని సీఎం కేసీఆర్ ను ఎప్పుడూ అడగలేదు- ఎమ్మెల్యే షకీల్

Posted by Jeevan Reddy MLA on Thursday, 12 September 2019

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలిసి కలకలం రేపిన బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమిర్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌లో ఎంత కష్టపడినా గుర్తింపు లేదని ఉదయం మీడియా ప్రతినిధులతో అన్న ఆయన తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు. టీఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, బతికి ఉన్నంత వరకు టీఆర్ఎస్ ను వీడనని స్పష్టం చేశారు.   

‘నేను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తున్నాను. సీఎం కేసీఆర్ నాకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారు. ఆయన ఆశీర్వాదంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్, ఆయనకు రుణపడి ఉంటాను నేను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను వీడను..మంత్రి పదవి కావాలని సీఎంను అడగలేదు. మైనారిటీల తరఫున మహమూద్ అలీ మంత్రి ఉన్నారు.. ’ అని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనులపై మాట్లాడేందుకే అరవింద్‌ను కలిశానని వివరణ ఇచ్చారు. పార్టీ మారే అంశంపై సోమవారం పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారుగదా అని ప్రశ్నించగా, విలేకర్లందరూ అందుబాటులో ఉండేలా ఆరోజు మాట్లాడతానని ముక్తాయించారు.