శవాలు కదులుతాయి.. శాస్త్రీయంగా రుజువైంది! - MicTv.in - Telugu News
mictv telugu

శవాలు కదులుతాయి.. శాస్త్రీయంగా రుజువైంది!

September 13, 2019

bodies move.

నమ్మలేకపోతున్నారా? కానీ,  నమ్మతీరాల్సిందే అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త. మనిషి చనిపోయాక కళేబరం ఏడాదిపాటు కదులుతుందని ఆమె బల్లగుద్ది వాదిస్తున్నారు. ఒక శవాన్ని 17 నెలల పాటు ఫొటోలు తీసి, ఫలితాలు విశ్లేషించానని అంటున్నారు. ఆమె పేరు ఎలిసన్ విల్సన్. సీక్యూ యూనివర్సిటీలో ఆమె క్రిమినాలజీలో పట్టా పుచ్చుకున్నారు. 

సిడ్నీ శివారులోని శ్మశాన వాటికలో విల్సన్ ఓ శవంపై ఈ అధ్యయనం చేశారు. శవాలు పూడ్చిపెట్టాక రసాయనిక చర్యల వల్ల కొంతమేరకు కదులుతాయని తన పరిశోధనలో తేలినట్లు విల్సన్ తెలిపింది. ‘మేం ఎంచుకున్న శవాన్ని ప్రతి అర గంటకు ఒకసారి ఫోటో తీశాం 17 నెలలపాటు తీసిన ఫొటోలను విశ్లేషించాక శవం కదిలినట్లు తేలింది. చేతుల్లోని కండరాలు, ద్రవాలు క్షీణించడం వల్ల శవం భంగిమలో తేడాలు వస్తాయి.. పీనుగలు వాటి ఉంచిన స్థలంలో ఉండవు. కుళ్లిపోవడడం, లిగమెంట్ ద్రవాలు ఎండిపోవడం వల్ల కాస్త పక్కకు జరుగుతాయి…’ అని చెప్పారు. విల్సన్ అధ్యయన ఫలితాలను ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్.. సినర్జీ పత్రికలో అచ్చేశారు.