శరీరం ఏ షేప్‌లో ఉన్నా సెక్సీనే... - MicTv.in - Telugu News
mictv telugu

శరీరం ఏ షేప్‌లో ఉన్నా సెక్సీనే…

November 27, 2017

బాడీ షేమింగ్.. పాత పదమే అయినా జబర్దస్త్ హైపర్ ఆది.. కత్తి మహేశ్‌ను పొట్టా, బట్టా అని తిట్టడంతో ప్రచారంలోకి వచ్చింది. లావుగా ఉన్నవారిని సినిమాల్లో, టీవీ షోల్లో ఎగతాళి చేయడంపై  తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఏదైనా చూసే దృష్టిని బట్టి ఉంటుందని తమిళ, తెలుగు హాస్యనటి విద్యుల్లేఖా రామన్ అంటోంది.

 


ఈ సందేశామిస్తూ.. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పెట్టిన ఫొటోలు కలకలం రేపుతున్నాయి. లావుగా ఉన్న మహిళలు కూడా సెక్సీగానే ఉంటారంటూ ఆమె తన ఫొటోలను పోస్ట్ చేసింది. మన శరీరాలను మనం ప్రేమించాలని, ఎవరు ఏమన్నా మనం పట్టించుకోకూడదని పేర్కొంది. ఈ ఫొటోలపై అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి ప్రచారం వల్ల బాడీ షేమింగ్ పై ప్రజల ఆలోచన ధోరణి మారుతుందని అంటున్నారు.