ఏక్‌నిరంజన్ కొంపలో 200 నకిలీ ఓట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏక్‌నిరంజన్ కొంపలో 200 నకిలీ ఓట్లు..

October 2, 2018

ఒక ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటారు? ముగ్గురు, నలుగురు, మహా అయితే పది మంది. మరి నకిలీ ఓట్లు ఎన్ని ఉంటాయి? ఉంటే గింటే ఒకటో, రెండో. అసలే మన మహా ఘనత వహించిన ఎన్నికల అధికారులు బోగస్ ఓట్లను చింపి పాతరేస్తున్నారు కనుక ఒకింట్లో ఒక నకిలీ ఓటు కూడా ఉండదు సుమీ అనుకుంటుంటాం.

Over 180 fake voters from one house In LB Nagar Hyderabad

కానీ హైదరాబాద్‌లో ఒక ఇంట్లో మాత్రం ఏకంగా 200కుపైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. ఒకే అడ్రస్‌లో ఇన్నిపేర్లేమిటని ఆరా తీసిన ఆధికారులకు చుక్కలు కనిపించాయి. ఆ ఇంట్లో ఉంటున్నది ఒకే ఒక్కడు కావడంతో మైండ్ బ్లాకయ్యి దిమ్మ తిరిగిపోయింది. ఆ ఇల్లు ఎల్బీనగర్ పరిధిలోని హయత్ నగర్‌లో ఉన్న శారదానగర్ లో ఉంది.  5-4-1458 నంబరు ఇంట్లో బురుగుల బాబురావు అనే 70 ఏళ్ల ముదుసలి కాపురం ఉంటున్నాడు. ఆ ఇల్లు హిందూ అవిభాజ్య కుటుంబమేమో, తాతలు, అవ్వలు, కొడుకులు, మనవళ్లు గట్రా ఉన్నారేమోనని ఎన్నికల అధికారులు అనుకున్నారు. బోగస్ ఏరివేత కనుక పూర్తి వివరాలు ఆరా తీశారు. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని, మిగతా 200 పైచిలుకు ఓటర్లంతా ఫేకూలని తేలడంతో చకచకా పొరపాట్లు సరిచేసుకున్నారు.