బాయిల్డ్ రైస్ సేకరించం: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

బాయిల్డ్ రైస్ సేకరించం: కేంద్రం

March 30, 2022

modi

కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇకనుంచి బాయిల్డ్ రైస్‌ను సేకరించమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతకొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. తెలంగాణలో పండించే వరిని కొనాలని టీఆర్ఎస్ మంత్రులు డిమాండ్ చేశారు.

అంతేకాకుండా పార్లమెంట్‌ సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలోని బాయిల్డ్ రైస్‌ను కొనాలని ఆందోళనలు, నిరసనలు చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్ సాక్షిగా మరోసారి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి పార్లమెంట్‌కు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అవసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించుకోవాలని పార్లమెంట్‌కు తెలిపారు. కేంద్రం ఇక బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్‌లోనే చెప్పినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.