హైదరాబాద్‌లో విమాన భాగాల తయారీ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో విమాన భాగాల తయారీ షురూ

March 1, 2018

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. టాటా అడ్వాన్స్ సిస్టం అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో గురువారం బోయింగ్ విమాన విడిభాగాల తయారీ మొదలైంది. ఇందులో అపాచీ హెలికాప్టర్లను కూడా తయారు చేయనున్నారు. ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించింది. రక్షణ మంత్రి నిర్మాలాసీతారామన్ ముఖ్య అతిథిగా హాజరైన పనులను ప్రారంభించారు.తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా, రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో వైమానిక సెజ్‌లో 13 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్తతయ్యేవాటికి అమెరికా సహా 15 దేశాల్లో డిమాండ్ ఉంది.