బాలీవుడ్ నటి పూనమ్ పాండే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా 2011లో వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధిస్తే..టీమిండియా క్రికెటర్ల ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలుచుంటా అంటూ హాట్ కామెంట్స్ చేయడంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఆ తర్వాత అలా ఏం జరగలేదులే. ఇవాళ పూనమ్ పాండే 32వ జన్మదినం జరుపుకుంటోంది. ఆమె పుట్టినరోజుకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ప్రపంచ కప్ వివాదం గురించి మాట్లాడింది.
2011లో భారత్‌లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా భారత్ ప్రపంచకప్ గెలిస్తే తన బట్టలు విప్పేస్తానని చేసిన ప్రకటనతో పూనమ్ పాండే తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా, పూనమ్ పాండే తన బోల్డ్ లుక్, న్యూడ్ ఫోటోషూట్ కారణంగా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.
ప్రపంచకప్ వివాదంపై పూనమ్ పాండే
రేడియో మిర్చితో పూనమ్ పాండే మాట్లాడుతూ, ‘నాకు అప్పుడు 18 ఏళ్లు, జీవితంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాను? ఏదైనా పెద్ద పని చేద్దామనుకున్నాను. వరల్డ్ కప్ జరుగుతోంది. నేనేం చేసినా ప్రపంచం మొత్తం చూస్తుంది. అస్సలు క్రికెట్ గురించి నాకు తెలియదు. క్రికెటర్ల పేరు తెలియదు. కానీ నేను ఏదో ఒకటి చేయాలి. స్టేట్ మెంట్ ఇద్దాం ఇది పెద్ద స్టేట్ మెంట్, ఇండియా షేక్ అవుతుంది, ఆ స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఇండియా కూడా గెలిచింది అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ప్రతిరోజూ ఇంట్లో నరకం చూస్తున్నారు. అమ్మ కొడుతోంది. నాన్న అరుస్తున్నారంటూ తన బాధను వెల్లగక్కింది కాంట్రవర్సీ క్వీన్.