బొలెరో వాహనం బోల్తా.. ఆర్ఎస్ఐ మృతి
Editor | 2 May 2020 10:30 PM GMT
కరోనా సంక్షోభంలో ఘోరం జరిగింది. నిత్యం ప్రజాసేవలో భాగమైన ఓ పోలీస్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో బొలెరో పోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వరంగల్ పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)కి చెందిన ఆర్ఎస్ఐ కర్ణుడు అక్కడికక్కడే మృతి చెందారు. డిపార్ట్‌మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుండి హైదరాబాదు వెళ్తుండగా పెంబర్తి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated : 2 May 2020 10:30 PM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire