ఆ పర్వతం మనుషుల్ని తినేస్తుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పర్వతం మనుషుల్ని తినేస్తుంది..

May 29, 2017

మనుషుల్ని తినే పర్వతం ఏంటీ అని పరేషాన్ కావొద్దు.ఆశ్చర్యమేసినా ఇదినిజం. వెయ్యి, పది వెయ్యిలు కాదు లక్షల మందిని ఇప్పటివరకు తినేసిందట. అత్రీంద్రియ శక్తులేమీ ఈ పర్వతం ఇంతమందిని ఎలా పొట్టనపెట్టుకుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 

ఇంతకీ ఈ పర్యతం ఎక్కడ ఉందో తెలుసా బొలివియాలో..సెర్రోరికో పర్వతంలో వెండి నిక్షేపాలు అధికంగా ఉండేవి. అందుకే దీన్ని స్పానిష్‌ వాళ్లు ‘ధనిక పర్వతం’అనేవారు.

ఆ పర్వతంపై ఉన్న వెండిని కొల్లగొట్టేందుకు 1545లో తొలిసారిగా మైనింగ్‌ని మొదలుపెట్టారు. అందుకోసం అక్కడ స్థానికంగా ఉండే 30 లక్షల మందితో బలవంతంగా కొండను తవ్వించి వెండి ఖనిజాన్ని వెలికితీయించేవాళ్లు. దాదాపు ఐదు శతాబ్దాలుగా ఆ మైనింగ్‌ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.దీంతో పర్వతంలో పెద్ద పెద్ద సొరంగాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు అవి కూలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ప్రమాదాలతోనే కాకుండా అధిక పని.. ఆకలి.. వ్యాధుల బారినపడి ఇప్పటివరకు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈ పర్వతంపై ఉన్న మైనింగ్‌లో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అందులోంచి వెలువడిన ధూళితో చాలామంది వూపిరితిత్తుల సంబంధిత వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఇప్పటివరకు 80 లక్షల మంది మరణించినట్లు చరిత్రకారుల లెక్కలు చెబుతున్నాయి.ఇలా ఇంతమందిని బలితీసుకున్న ఈ పర్యతాన్ని ఇప్పుడు మనుషుల్ని మింగే మౌంటెన్ గా పిలుస్తున్నారు.