అమితాబ్ ఔదార్యం.. రైతుల రుణాలు చెల్లించాడు - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్ ఔదార్యం.. రైతుల రుణాలు చెల్లించాడు

June 13, 2019

Bollywood actor Amitabh Bachchan fulfills his promise, pays off loan of 2,100 farmers from Bihar.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ రైతులకు బాసటగా నీకిచ్చాడు. గతంలో తానూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బిహార్‌కు చెందిన 2,100 మంది రైతుల బ్యాంకు రుణాలను ఆయన చెల్లించారు. కొందరు రైతులను ముంబయిలోని తన ఇంటికి పిలిపించుకొని కూతురు శ్వేత, తనయుడు అభిషేక్‌ల చేతుల మీదుగా చెక్కులు అందించారు.

గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 1,398 మంది, మహారాష్ట్రకు చెందిన 350 మంది రైతుల రుణాలను అమితాబ్ ఇదే విధంగా చెల్లించిన సంగతి తెలిసిందే. మరో వాగ్దానాన్ని కూడా నెరవేర్చవలసి ఉందని అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. పుల్వామాలో అమరులైనవారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాల్సి ఉందని తెలిపారు. మరో నటుడు నానా పాటేకర్ కూడా అమితాబ్ వలే రైతులకు ఆర్థిక సహాయం చేస్తుంటాడు.