చెయ్యేశాడు.. పెళ్లాం ముందే చెంప చెళ్లుమంది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

చెయ్యేశాడు.. పెళ్లాం ముందే చెంప చెళ్లుమంది (వీడియో)

October 11, 2018

తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ దర్శకుడి చెల్లుమనిపించింది ఓ నటి. బాలీవుడ్ ‘జాలీ ఎల్ ఎల్బీ’ సినిమా దర్శకుడు సుభాష్ కపూర్‌.. నటి గీతిక త్యాగిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె సుభాష్ కపూర్‌కు  అతని భార్య ముందే చెంపపై లాగి ఒకటిచ్చింది. బాలీవుడ్‌లో మంచి పేరున్న సుభాష్ అసలు స్వరూపం ఇదే అంటూ ఆయన భార్యతో మాట్లాడిన మాటల వీడియోను గీతిక బయటపెట్టింది.

ఈ వీడియోలో సుభాష్ కపూర్ భార్య డింపుల్ ఏడుస్తూ కూర్చోగా.. ఆయన తనకేం తెలీదని, అసలేమి జరగలేదని చెప్పుకొచ్చాడు. దీంతో సుభాష్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపిస్తూ.. భార్య డింపుల్ ముందే అతణ్ణి చెంప పగులగొట్టింది. కాగా గీతిక బయటపెట్టిన వీడియోలో సుభాష్‌ను తిడుతున్నట్లు మాత్రమే ఉంది. కానీ అక్కడున్న సీసీ కెమెరాల్లో గీతిక సుభాష్ ను కొడుతున్న దృశ్యాల రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.