బాలీవుడ్‌లో మరో విషాదం.. హాస్యనటుడు జగదీప్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో మరో విషాదం.. హాస్యనటుడు జగదీప్ కన్నుమూత

July 9, 2020

Bollywood Actor Jagdeep No More

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రముఖ నటులు కొంత కాలంగా చనిపోతూ అభిమానులను శోఖసంద్రంలో ముంచేస్తున్నారు. తాజాగా మరో నటుడు కన్నుమూశాడు. ప్రముఖ హాస్యనటుడు జగదీప్(81) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బుధవారం రాత్రి 8:40 గంటలకు ఇది జరిగింది. దీంతో పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటించారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

1939 మార్చి 29న జన్మించిన జగదీప్‌ అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. అతడు బాలీవుడ్‌లో పలు సినిమాల్లో కమెడియన్‌‌గా, సహ నటుడిగా చేశారు. దాదాపు 400లకుపైగా సినిమాల్లో నటించి మెప్పించారు.1975లో వచ్చిన షోలేలో సూర్య భోపాలి పాత్రను పోషించారు. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఓ దశలో దర్శకత్వం కూడా వహించారు.1988లో ‘సూర్య భోపాలి’ అనే చిత్రానికి  మొదటిసారి దర్శకుడిగా మారారు. ఆరు దశాబ్ధాల పాటు నిర్విరామంగా అనేక మంది నటులతో ఆయన నటించారు.