రజనీకాంత్‌కు కరోనా అని బాలీవుడ్ నటుడి ట్వీట్! - MicTv.in - Telugu News
mictv telugu

రజనీకాంత్‌కు కరోనా అని బాలీవుడ్ నటుడి ట్వీట్!

June 5, 2020

 

Rajinikanth

ప్రముఖ నటుడు ర‌జ‌నీకాంత్ కు కరోనా వైరస్ సోకిందని బాలీవుడ్‌ న‌టుడు రోహిత్ రాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ”ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. కానీ, క‌రోనా క్వారంటైన్‌లో ఉంది.” అని రోహిత్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో ఒక్కసారిగా రజినీకాంత్ అభిమానులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అయితే, అది జోక్ అని తెలియ‌డంతో రజినీకాంత్ అభిమానాలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇలాంటి జోక్ చేసిన రోహిత్‌పై మండిప‌డుతున్నారు.

‘ఇలాంటి జోక్ భార‌తీయ సంస్కృతి కాదు.’, ‘క‌రోనా కామెడీ కాదు, ఇలాంటి త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేయ‌కండి.’ ‘జోక్ చెత్త‌గా ఉంది’ అంటూ రోహిత్ ను విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన రోహిత్ ‘ఎందుకంత ఆవేశ‌ప‌డుతున్నారు. మిమ్మ‌ల్ని న‌వ్వించాల‌నుకున్నాను. కానీ ఇలా అవుతుంద‌నుకోలేదు, అందుకు క్ష‌మించండి.’ అంటూ స‌మాధాన‌మిచ్చాడు.