నవరాత్రి ఉత్సవాల్లో సోనూ సూద్‌ విగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

నవరాత్రి ఉత్సవాల్లో సోనూ సూద్‌ విగ్రహం

October 23, 2020

soon

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ లాక్‌డౌన్‌లో ఎందరో వలస కార్మికులను, పేదలను ఆదుకున్న సంగతి తెల్సిందే. లాక్‌డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న ఎందరినో సొంతూళ్లకు చేర్చాడు. ఉద్యోగం లేదు అన్నా అని అడిగిన ఎందరికో ఉద్యోగాలు ఇప్పించాడు. వ్యవసాయం చేసేందుకు ఎద్దులు లేక కూతుళ్లనే కాడెద్దులుగా మార్చిన సంఘటన గురించి తెలుసుకుని సాయంత్రానికి ఇంటికి కొత్త ట్రాక్టర్ పంపించాడు. లాక్‌డౌన్ తరువాత కూడా సోను తన సేవా కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తున్నాడు. 

దాంతో సోనూ సూద్‌కు ప్రజల్లో ఆదరణ అభిమానాలు పెరిగిపోయాయి. తాజాగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఆయన‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌‌కతాలో జరిగింది. అక్కడ ప్రఫుల్లా కనక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిసున్న దుర్గామాత ఉత్సవాల్లో సోనూ సూద్‌ విగ్రహాన్ని పెట్టారు. ఆయన కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా కార్మికులు, బస్సుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కార ఇదేనని దీని సోను సూద్ దీని గురించి ట్వీట్ చేశాడు.