సమంతను కాపాడిన బాలీవుడ్ యాక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

సమంతను కాపాడిన బాలీవుడ్ యాక్టర్

March 12, 2022

sam

టాలీవుడ్ యాక్టర్ సమంతను బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ కాపాడిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఓవైపు తెలుగు సినిమాల్లో బీజీగా ఉన్నా సమంత.. బాలీవుడ్‌లో తొలిసారిగా వరణ్ ధావన్‌తో కలిసి జట్టుకట్టబోతోంది. ఆ ప్రాజక్టు సంబంధించి చర్చల కోసం వాళ్లిద్దరూ ముంబైలో శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన అనంతరం సమంత బయటకు వెళ్లిపోతున్న సందర్భంలో ఫొటో జర్నలిస్టులు ఆమె ఫొటోల కోసం ఒత్తిడి చేశారు.

దీంతో స్పందించిన వరుణ్ ధావన్.. ఆమెను కాపాడాడు. ఫొటో జర్నలిస్టులను ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ”హేయ్, హేయ్, జరగండి, జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నారు? భయపెట్టకండి ఆమెను” అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా సమంత కారు వరకు వెళ్లాడు.

మరోపక్క హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’కు ఇండియన్ వెర్షన్‌లో ఈ ఇద్దరూ జోడీ కట్టనున్నారు. రాజ్ అండ్ డీకేలు దర్శకత్వం వహించనున్నారు. బ్రిటన్‌లో ఇదే సిరీస్‌కు ప్రియాంక చోప్రాను నాయికగా తీసుకున్నారు. కాగా, ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో అభిమానులను అలరించిన సమంత.. ఇప్పుడు ‘సిటడెల్’తో మరింత దగ్గరకానుంది.