అక్క కోసం..మీడియా ముందే ఏడ్చేసిన ఆలియ - MicTv.in - Telugu News
mictv telugu

అక్క కోసం..మీడియా ముందే ఏడ్చేసిన ఆలియ

December 2, 2019

ఎల్లపుడూ.. ఉల్లాసంగా, ఉత్సాహంగా చిరునవ్వుతో ఉండే బాలీవుడ్ నటి ఆలియా భట్ తన సోదరి గురించి చెబుతూ మీడియా ముందే ఏడ్చేశారు. ఆలియా సోదరి షహీన్ ఒకప్పుడు తీవ్ర డిప్రెషన్‌తో బాధపడ్డారు. చికిత్స తీసుకున్నాక కోలుకున్నారు. 

ఈ సందర్భంగా తాను డిప్రెషన్‌తో ఎలా పోరాడిందో వివరిస్తూ ‘ఐ హావ్ నెవర్ బీన్ హ్యాపీయర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని ఆదివారం ముంబయిలో ఆలియా భట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తన సోదరి డిప్రెషన్‌తో ఎలా పోరాడిందో చెబుతూ ఆలియా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. దాంతో పక్కనే ఉన్న షహీన్ తన సోదరిని ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఆలియా ఏడుస్తున్నప్పుడు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆలియా ‘ఆర్ఆర్ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ సినిమాల్లో నటిస్తున్నారు.