బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తన రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. గత ఏడాది నవంబరులో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన అలియా భట్.. అప్పటి నుంచి సినిమాలకి దూరంగా ఉంటోంది. అయితే.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన అలియా భట్.. సినిమాల్లోకి తన రాక మీద అప్‌డేట్ చెప్పేసింది. అలియా భట్ ఆఖరిగా గత ఏడాది ‘బ్రహ్మస్త’ సినిమాలో నటించింది. ఇందులో ఆలియా, రణబీర్ కపూర్ జంటగా నటించారు.
అలియా భట్ కి గత ఏడాది నవంబరులో పాప పుట్టింది. ఆమెకి ‘రహా’అని పేరు పెట్టారు. ప్రస్తుతం పాపతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది అలియా భట్. కానీ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చింది. అలియా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఇందులో ఒకటి రణవీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ.రెండో సినిమా కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తున్న జీ లే జరా. ఈ రెండు సినిమాల కోసం అలియా భట్ త్వరలోనే షూటింగ్‌కి హాజరుకానుంది.
రహా పుట్టిన తర్వాత తన ప్రయారిటీస్ మారిపోయాయి అని చెప్పింది ఆలియా. ఇప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీ రహానే. మదర్‌గా పాపకి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. రహా విషయంలో ఒక్కటే రిక్వెస్ట్. పాపకి రెండేళ్ళు వచ్చే వరకూ ఆమె ఫొటోలు తీయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. ఇక సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ గతంలో చేసినట్లు కాకుండా.. క్వాలిటీ సినిమాలే చేస్తానని అలియా చెప్పింది.